banner image

Pawan Kalyan's new party is called 'Jana Sena'


పార్టీ పేరు ‘జనసేన’..!

ఇక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చుకోవాలా లేదా అనే మీమాంస లేదు. ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు. ఇందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈమేరకు వపన్ సోమవారం తన సన్నిహితుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ‘జనసేన’ అనే పేరుతో కొత్త పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికార వర్గాల సమాచారం. 




దీంతో పవన్ కల్యాణ్ ఈనెల 14న ఏర్పాటు చేయబోయే మీడియా సమావేశంలో తన రాజకీయ అరంగేట్రం గురించి విధివిధానాలను ప్రకటించడమే ఆలస్యమని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు హైటెక్ సిటీలోని హైటెక్స్ ప్రాంగణంలో పీవీపీ సంస్థ అధ్వర్యంలో చకచకా జరిగిపోతున్నాయి.


)
Pawan Kalyan's new party is called 'Jana Sena' Pawan Kalyan's new party is called 'Jana Sena' Reviewed by psd on March 12, 2014 Rating: 5

No comments:

Powered by Blogger.